ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని మద్యం షాపులకు సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. సీఐ చంద్రమణి మాట్లాడుతూ. పుట్టపర్తిలోని సాయి ఆరామం కాంప్లెక్స్‌లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం షాపు లాటరీలో గెలుపొందిన వారు 6వ వంతు నగదును తక్షణమే చెల్లించాలన్నారు. మద్యం షాపు దరఖాస్తుదారులు సహకరించాలని అన్నారు.