విజయవాడలోని ఏపీ సచివాలయ ఛాంబర్ లో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ను అనంతపురం జిల్లా కు చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని సోమవారం కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.