ఉదయగిరి: ఆగిపోయిందనుకున్న వర్షం మళ్ళీ మొదలు

82பார்த்தது
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలో మళ్లీ వర్షం కురవడం మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసినప్పటికీ మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఆగిపోయింది. దాదాపు మూడు రోజుల తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశంలో సూర్యుడు దర్శనం ఇచ్చాడు. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి వర్షం కురవడం మొదలైంది. అలాగే రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி