నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, అంగన్వాడీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.