కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం- బట్టువారిపాలెం మధ్యలో ఉన్న వాగు శుక్రవారం కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇబ్బంది జరుగుతుందని ఆయా గ్రామస్తులు ఎమ్మెల్యేకి తెలిపారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.