దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు సచివాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి పోస్టర్లు, ఫోటోలు నేటికీ దర్శనమిస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతున్నా నేటికీ అధికారులు తొలగించకపోవడం మీద ఆదివారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మీడియా కథనాలతో అప్రమత్తమైన అధికారులు సోమవారం హుటాహుటిన మాజీ ముఖ్యమంత్రి పోస్టర్లను, ఫోటోలను తొలగించారు.