దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లులో శనివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పాఠశాల వద్దనున్న మెయిన్ రోడ్డు వరదతో నిండిపోయింది. వరద నీరు రోడ్లను ముంచేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరదలకు వీధి రోడ్లు మునగడం చూసాము గానీ మెయిన్ రోడ్డు మీదకు ఈవిధంగా వరద రావడం ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు వాపోతున్నారు.