ఉదయగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ మస్తాన్ వలి తెలిపారు. బుధవారం ఉదయగిరిలోని విద్యా వనరుల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు ఈనెల 17 వరకు ఉందని, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3. 50 లక్షల లోపు ఉన్న కుటుంబాల విద్యార్థులు అర్హులన్నారు. డిసెంబర్ 8న పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగానే వివరాలు నమోదు చేయాలన్నారు.