ఉదయగిరి మండలం వెంగళరావు నగర్ గ్రామ సమీపంలో ఉదయగిరి- గండిపాలెం రహదారిపై ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. చెట్ల మధ్యలో విద్యుత్ స్తంభం ఒకవైపు వంగడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కుడుస్తుండడం, వీధురు గాలులు వీస్తుండడంతో ఏ నిమిషమైన ప్రమాదం జరగవచ్చని కావున ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.