తుఫాన్ కారణంగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనుబోలు మండలం పరిధిలోని కొలనుకుదురు గ్రామంలో మంగళవారం ఎస్సై శివ రాకేష్ స్థానిక గిరిజనులకు తుఫాన్ ప్రభావం పై అవగాహన కల్పించారు. తుఫాన్ భవనాలను పరిశీలించి, ముందస్తుగా అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ ముఖ్యంగా సెల్ ఫోన్ లకు చార్జింగ్ పెట్టుకుని అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.