బోగోలు: భార్యపై అనుమానం.. చివరికి హత్య
బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేటలో మంగళవారం సాయంత్రం ఒక కిరాతక హత్య జరిగింది. గ్రామానికి చెందిన తస్లీమా (35) మరియు జలచిత్ర దత్తు (దత్తాత్రేయ) భార్యాభర్తలు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న దత్తు, మంగళవారం కత్తితో గొంతు, కడుపులో పొడవడంతో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పరారయ్యాడు. తస్లీమా తండ్రి అబులా పేజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.