ఝార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బుధవారం 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహం పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓట్లు వేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.