వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న వర్షాలకు వరద ప్రభావానికి లోనయ్యే వివిధ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జ్, రామలింగాపురం, బాక్స్ బ్రిడ్జి పంప్ హౌస్ తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.