ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న లగచర్ల వాసులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు నిర్వాసితులకు భారీ ఎత్తున పరిహారం ఇస్తామని ప్రకటించారు. బుధవారం వారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాల వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొదని రైతులకు పిలుపునిచ్చారు. కోడంగల్ ప్రాంతం అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు.