నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో బుధవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.