సర్వేపల్లి: అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: కాకాణి
ఎన్ని అక్రమ కేసులు బనాయించిన తాను భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు వెంకటాచలం పోలీసు స్టేషన్ వద్ద సోమవారం ఆయన మీడియాతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా లో షేర్ చేశామన్న కారణంతో పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు.