నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు నివాసంలో మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయలకు సంబంధించి పలు రాజకీయ అంశాలను చర్చించారు. అలాగే పలువురు స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు.