నెల్లూరు రూరల్ పరిధిలోని 19 డివిజన్ ముత్యాల పాలెం, రామలింగాపురంలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముందుకు సాగారు. నెల్లూరు రూరల్ లో అత్యధికంగా 35వేల మెజార్టీతో గెలిచామని వారి రుణం తీర్చుకోలేమన్నారు. నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.