కోవూరు: కన్నుల పండుగగా శివపార్వతుల కల్యాణోత్సవం
కోవూరు నియోజకవర్గంలోని గండవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సోదరుల నేతృత్వంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక భక్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులతో గండవరం గ్రామం పోటెత్తింది నాగేంద్ర మహాదర స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.