ఇందుకూరుపేట నడిబొడ్డులో స్థానిక పోలీస్ స్టేషన్ కి అతి దగ్గరలో వైన్ షాప్ పెట్టడంపై స్థానిక మహిళలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డు మీద నిరసన చేయడంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఇందుకూరుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి నిరసన కార్యక్రమం ఆపే ప్రయత్నం చేశారు.