ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శనివారం కోరారు. ఈ మేరకు నెల్లూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.