బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ ను శుక్రవారం ఏర్పాటు చేశారు. మెప్మా పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారుచేసిన పలు రకాల వస్తువులను, ఆహార పదార్థాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి అర్బన్ మార్కెట్ ను పరిశీలించారు.