విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 'సోషల్ మీడియా అండ్ సైబర్ బుల్లింగ్' అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేటి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనే అంశాలపై విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. సుజాత, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.