గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పేర్కొన్నారు. కోవూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరిగాయన్నారు. దాంతో యువత, విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారారన్నారు.