ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన రూ. 2, 17, 200 చెక్కును కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిపాలెంకు చెందిన వృద్ధురాలు గొంది రామలక్ష్మమ్మ గత రెండు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీనితో బాధిత కుటుంబ సభ్యులు మోకాళ్ళ మార్పిడి చికిత్సకు ఆర్థిక సహాయం చేయమని ఎమ్మెల్యేను కోరడంతో సీఎం నిధి ద్వారా నగదు అందింది.