రాళ్లపాడు నిండింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
రాళ్లపాడు ప్రాజెక్టుకు ప్రస్తుతం పూర్తిస్థాయి మేర నీరు చేరినది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం పెరిగి అధికారులు నీరు కిందకు విడుదల చేసే అవకాశం ఉంది. కావున మన్నేరు వాగు ప్రవహించే ఇరువైపుల ఉండే గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మన్నేరు ప్రవాహ ప్రాంతాలకు ఎవరు వెళ్లరాదని, మన్నేరు ప్రవహించే బ్రిడ్జిలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు.