కందుకూరు టిడిపి కార్యాలయంలో మంగళవారం వలేటివారి పాలెం మండలం కొండ సముద్రం గ్రామానికి చెందిన మన్నం పుల్లయ్య కు సీఎం సహాయ నిధి ద్వారా రూ. 350000 ఎల్ఓసి ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారని, కానీ మా ప్రభుత్వం ప్రజల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.