గుడ్లూరు, కందుకూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి కోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు లని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.