జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, దుత్తలూరు, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో ఆకాశంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమైంది. దట్టని మబ్బులను కమ్ముకొని వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.