వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికార తగాదా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమె ప్రెస్మీట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవాలని చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూసేందుకు ఆమె మీడియా ముందుకొచ్చారు. కొంతకాలంగా వైఎస్ జగన్ను తిట్టేందుకే షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. మళ్లీ జగన్ సీఎం కావొద్దనుకుంటున్నారు.