ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు-కొమ్మంగి పంచాయతీల మధ్య పదేళ్ల క్రితం ఆర్టీసీ బస్సులు తిరిగేవి. అయితే రోడ్లు అధ్వానంగా ఉండటంతో ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను నిలిపివేసింది. దాదాపు పదేళ్ల ప్రభుత్వం రహదారిని పునరుద్ధరించడంతో మళ్లీ బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దాంతో కొమ్మంగి, ఎర్రబందం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.