సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ నేషనల్/ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసోసియేషన్ అనుబంధ సంస్థల అధికారులమని కాల్స్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలకు గురికాకుండా ఉండవచ్చన్నారు. ఈమధ్య నేరగాళ్లు హ్యూమన్ రైట్స్ పేరుతో ఫేక్ వెబ్సైట్, ఐడి కార్డ్స్, సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.