కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి వాటి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని కనిగిరి వైసీపీ ఇంఛార్జీ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో ప్రోటోకాల్ ప్రకారం వైసిపి సర్పంచ్లను పిలవలేదని ఆరోపించారు. కూటమి నాయకులు కొందరు అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.