అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

52பார்த்தது
అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగ్గలూరు గ్రామంలో స్థానిక ఎస్సై మధుసూదన్ రావు తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 26 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్సై తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி