కందుకూరు: నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రముఖ దినపత్రిక ప్రజాశక్తి క్యాలెండర్ ను శనివారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విలేకరి నాదెండ్ల కోటేశ్వరరావు, గుడ్లూరు కొట్టే వెంకయ్య, ఉలవపాడు ఎస్. కె మీరాషా ప్రజాశక్తి ఏజెంట్ సాదు పవన్ కుమార్, పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.