అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారం వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెంచడం న్యాయమా అని మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం ఆయన కందుకూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.