గిద్దలూరు: అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికుడు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని మోడంపల్లి రోడ్డులో కొద్దిరోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని మంగళవారం తెలిపారు. సమస్యలకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కూడా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. సకాలంలో టాక్స్ లు కూడా కడుతున్నామని ఎందుకు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులను నిలదీశాడు.