విశాఖపట్నం తీరంలో కొన్ని చోట్ల ఇసుక నల్లగా కనపడుతోంది. చాలామంది కాలుష్యమే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. నిపుణులు మాత్రం కారణం ఇది కాదని చెప్తున్నారు. తూర్పు కనుమల్లో వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్టరేషన్ అయ్యి అందులో నుంచి ఇసుక అంత పార్టికల్స్ రూపంలో రిలీజ్ అవుతాయి. నదుల ద్వారా ఇవి సముద్రానికి చేరతాయి. అలలు ఎక్కువగా వచ్చినపుడు నల్లటి పార్టికల్స్ అనేవి ఒక్క చోటుకు చేరుతాయి. విశాఖ బీచ్ లో ఇసుక నల్లగా మారడానికి కారణం ఇదేనట.