గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహించినట్లుగా అర్చకులు తెలిపారు. 60 సంవత్సరాలుగా ఈ ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయని చుట్టుపక్కల 50 గ్రాములకు పైగా ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అర్చకులు చెప్పారు.