వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణం పరిరక్షణపై ప్రజలు, యువత ముందుకు రావాలని నార్వాయిపేట సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ కోరారు. వన్యప్రాణుల వారోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామపంచాయితీ కార్యాలయము అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణులు వేటగాళ్ళ నుండి చాల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు.