మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. బుధవారం కంభం పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి రోడ్డుపై అడ్డంగా వెళుతున్న యువకుడిని ఓ వ్యక్తి దూషించాడు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు జాతీయ రహదారిపై అడ్డంగా పడుకొని వాహనాలకును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కల్పించుకొని మద్యం సేవించి ఉన్న యువకుడిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.