మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి 7వేల క్యూసెక్కుల నీరు ఇప్పటికి చేరింది. ప్రాజెక్టు ఏ. ఈ రామాంజనేయులు మాట్లాడుతూ 3 గేట్ల ద్వారా 12 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టులో 20. 5 మీటర్ల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు.