ఎస్. కోట స్థానిక చైతన్య కళాశాలలో ఎస్ వి ఈ ఈ పి కార్యక్రమంలో భాగంగా గురువారం తహశీల్దార్ అరుణ కుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఆర్ ఓ తదితరులు పాల్గొన్నారు.