గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామంలో వరి చేల కుప్పలను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి సంతోషపురం, మరుపెంట గ్రామాల్లో సంచరిస్తున్నాయి. మంగళవారం రాత్రి సుంకి గ్రామ సమీపంలోని చెరువులో ఉంటూ రాత్రి సమయంలో పంటలను ధ్వంసం చేశాయి. గ్రామంలోని గొల్లు అన్నపూర్ణ, గొల్లు చంద్రమౌళి తదితర రైతులకు చెందిన పంట పొలంలో వేసిన వరి కుప్పలను తిని చెల్లా చెదురు చేసి తీవ్రంగా నష్టపరిచాయి.