ఉపాధి హామీ నిధులతో పల్లె పండుగ కార్యక్రమం క్రింద నియోజక వర్గంలో శిలా ఫలకాలు వేసిన పనులన్నిటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగ మాధవి తెలిపారు. బుధవారం ఆమె నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద తాడివాడ గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం క్రింద గుర్తించిన పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో 24 కోట్ల రూపాయలతో 682 పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.