కురుపాం మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ శుక్రవారం పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.