మన్యం జిల్లా వ్యాప్తంగా మత్స్య సంపద అభివృద్ధి చెందాలని కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో గురువారం తోటపల్లి రిజర్వాయర్ లో దాదాపు ఆరు లక్షల ఫింగర్లింగ్స్ (చేప పిల్లల)ను ఎమ్మెల్యే వదిలే కార్యక్రమం చేపట్టారు. పది లక్షల చేప పిల్లలను గుమ్మలక్ష్మి పురం మండలం డుమ్మంగి ప్రభుత్వ చేపల పెంపక కేంద్రం నుండి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.