పొన్నూరు పట్టణంలో మంగళవారం కమిషనర్ రమేష్ బాబు జిబిసిరోడ్డు, బ్రాహ్మణ బజార్ , శంకర మఠం, ఎస్ పి పి రోడ్డు ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఎస్పిపి రోడ్డులో మ్యాన్ హోల్ కుంగిపోవటంతో త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతంలో నూరు శాతం శానిటేషన్ కార్యక్రమాలు జరగాలని సిబ్బందికి ఆదేశించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.