చిలకలూరిపేట పురపాలక సంఘం నందు మునిసిపల్ కమీషనర్ సి. హెచ్ గోవిందా రావు ఆధ్వర్యంలో స్వచ్చత హై సేవ -2024 కార్యక్రమము లో భాగముగా బుధవారం మొదటి రోజున స్వచ్చత హై సేవ అవగాహన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి పురపాలక సంఘ మునిసిపల్ చైర్మన్ షేక్. రఫాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమము లో వార్డు మెంబర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.