విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అలాగే విజయవాడ-న్యూదిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించారు. శనివారం అధికారులతో విమానాశ్రయ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.